ఇంటర్ వ్యూహం'!

BSR NEWS

విల్స్ ఎంపిక ప్రక్రియలో మౌఖిక పరీక్షకు యూపీఎస్సీ ఎంతో ప్రాముఖ్యం ఇస్తుంది. ఎందుకంటే.. సెలక్షన్/ రిక్రూట్మెంట్ విధానంలో.. రాత పరీక్ష ప్రాథమికంగా అభ్యర్థి మేధా నైపుణ్యానికి నిదర్శనంగాఉంటుంది. అంతేగానీ అభ్యర్థి స్వభావం, సహానుభూతి, బావోద్వేగ ప్రజ్ఞ,ప్రేరణాత్మక వైఖరి, విలువల వ్యవస్థ గురించి తెలియజేయదు. ప్రిలిమినరీలో ఉండే ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అభ్యర్థికి ఉండేవిస్తృత ఆలోచనా పరిధినీ, జ్ఞాపకశక్తిని ప్రతిబింబిస్తాయి, మెయిన్లోనిషార్ట్ ఆన్సర్ తరహా ప్రశ్నలు.. ప్రత్యేక అంశాలను సాధారణీకరించి, సహేతుకంగా రాసే సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. అయితే ప్రిలిమినరీగానీ,మెయిన్ గానీ,, అభ్యర్థి సివిల్ సర్వీసెస్ కెరియర్కు సరిపోతాడా లేదా అనేవిషయంలో స్పష్టతను అందించలేవు. అభ్యర్థి ప్రవర్తనాపరమైన లక్షణాలను తెలుసుకునే విధంగా రాత పరీక్షలో ప్రశ్నలు అడగలేదు. అభ్యర్థి అర్హుడో కాదో తెలుసుకోవడానికిపర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆదర్శవంతమైన పద్ధతి.

సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలనుయూపీఎస్సీ ఇటీవలే ప్రకటించింది. దీంట్లో అర్హత సాధించిన

అభ్యర్థులందరూ పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ)కు హాజరవుతారు.పరీక్ష ఫలితాలు వెలువడిన నెల రోజుల్లోపే ఈ మౌఖికపరీక్షలు ప్రారంభమవుతాయి. కీలకమైన ఈ తుదిఅంచెపై సరైన అవగాహన తాజా అభ్యర్థులకూ,సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న విద్యార్థుల తప్పనిసరి.

2. ఇంటర్వ్యూలో కొన్ని మార్కులు అధికంగా సాధించినా దానివల్ల 10ర్యాంకులకంటే ఎక్కువ తేడా వస్తుంది.

3. కొన్నిసార్లు ఇంటర్వ్యూలో 2 లేదా 3 మార్కులు తగ్గినా.. 3 లేదా 4ర్యాంకులు తగ్గిపోతాయి. ఈ తేడా వల్ల ఐఏఎస్ దక్కకుండా ఇతర సర్వీసులకు పరిమితం కావాల్సి వస్తుంది.

ఇదిగో..

ఇంటర్ వ్యూహం'!

మార్కులూ ర్యాంకులూఎలా ముందడుగు వేయాలి? గత కొన్నేళ్లుగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులు మార్కులను విశ్లేషిస్తే..

1. టాపర్లు అందరూ మెయిన్స్లోనూ, ఇంటర్వ్యూలోనూ ఎక్కువ మార్కులు సాధించారు. (టాప్ 50 లేదా 100 ర్యాంకులు సాధించిన ఇంటర్వ్యూ బోర్డు అభ్యర్థులను తికమక పెడుతూ సందిగ్ధ పరిస్థితిలో పడేయాలని ప్రయత్నిస్తుందనుకుంటారు చాలామంది. కానీ ఇది నిజం కాదు. మీరు ఆశిస్తున్న ఉద్యోగానికి మీరెంత వరకూ అర్హులనే విషయంలో ఒక అంచనాకు రావాల్సిన బాధ్యత బోర్డుకు ఉంటుంది. ఇంటసందర్భంగా...వారు)అంచనా ఇలా..అభ్యర్థులను సరిగా అంచనా వేయడానికి ఇంటర్వ్యూ బోర్డు కింది అంశాలను పరిశీలిస్తుంది.

ప్రపంచంలో తన చుట్టూ జరుగుతోన్న ఘటనల పట్ల అభ్యర్థి ఆసక్తి కనబరుస్తున్నాడా? రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సామాజిక జీవితం,క్రీడలు, ఆరోగ్యం మొదలైన రంగాల్లోని తాజా పరిణామాలను పరిశీలిస్తున్నారా? వర్తమాన విషయాలను వార్తాపత్రికలను చదివి తెలుసుకుంటున్నారా లేదా?• వార్తలను విశ్లేషించి సరైన నిర్ధారణకు వస్తున్నారా.. లేదా? నిర్దిష్ట విషయం సమాజంపై ప్రభావం చూపేదా, సాధారణ అంశమా అనేది అంచనా వేయగలుగుతున్నారా?అతడి/ఆమె ప్రజెంటేషన్లో తగినంత స్పష్టత ఉందా?సమస్యల పట్ల దృక్పథం ఎలా ఉంది? ప్రజలకు సేవచేయాలనేఉద్దేశమా? ఆదర్శవాదమా? సమస్యలకు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తున్నారు.

| సమస్యను సరిగా అర్థంచేసుకుని తన అభిప్రాయాన్ని వెల్లడించగలుగుతున్నారా? లేదా ఎక్కడో చదివినదాన్ని చిలకలాగా వల్లె వేస్తున్నారా?విషయాన్ని నిర్మాణాత్మక దృక్పథంతో చూస్తున్నారా? ఆశావాదమా.. . నిరాశావాదమా? మొండిఘటం అనే ముద్ర వేసుకుంటున్నారా? లేదా తన అభిప్రాయాన్ని మార్చుకునే దృక్కోణంతో ఉన్నారా?చాకచక్యంగా సమాధానాలు చెబుతున్నారనే అభిప్రాయాన్ని కలిగిస్తారా,నిర్లక్ష్యంగా పర్యవసానాల గురించి ఆలోచించకుండా స్పందిస్తారా?తొందరపాటుగా నిర్ధారణకు వచ్చేస్తారా. పూర్తి సమాచారం అందేవరకూ నిర్ణయాలను వాయిదా వేస్తారా? సహాయపడటానికి పరిధి దాటి వ్యవహరిస్తారనే అభిప్రాయం కలిగిస్తారా, పరిధికి లోబడి తన విధులను నిర్వర్తిస్తారా? మొత్తానికి అధికారిగా విజయం సాధిస్తారా. సాధించరా?

మీ వైఖరిలో విశ్వాసం కనిపించాలిగానీ మొండితనం కాదు. ఉద్యోగం చేయగలరనే నమ్మకం మీ మీద మీకే లేనప్పుడు బోర్డుకు కలుగుతుందని అనుకోకూడదు. మీ బలహీనతల గురించి క్షమాపణలు చెప్పకూడదు. మీ బలాలను బహిర్గతపరచడానికి ప్రయత్నించాలి. బోర్డు సానుకూల ప్రదర్శనకు ఆసక్తి చూపిస్తుందిగానీ ప్రతికూల ప్రదర్శనకు కాదు. మొండిగా ప్రవర్తిస్తే బోర్డు సభ్యులెవరికైనా కోపం వస్తుంది. అవాస్తవమైన బలాలను ప్రదర్శిస్తూ, బలహీనతలకు ముసుగువేయాలని చూడకూడదు.సౌకర్యంగా, నిటారుగా కూర్చోవడం సాధన చేయాలి. అలాగని మరీ బిగుసుకుపోకూడదు. నిర్లక్ష్యంగా కూర్చోవడం వల్ల ఇతర విషయాల్లోనూ అలాగే ఉంటారనే అభిప్రాయం కలుగుతుంది. ఈ సందర్భం ప్రాధానాన్ని మీరు గుర్తించినట్టుగా అభిప్రాయపడతారు.చర్చనీయాంశాన్ని జోన్గా తీసుకోకూడదు. పొడిపొడిగా మాట్లాడకూడదు. మీ వైఖరి సివిల్స్ స్థాయికి తగినట్టుగా ఉండాలి. బోర్డుకు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. ఆ సమయాన్ని వాళ్ళు వృథాచేయాలని అనుకోరు. అలాగే మీరు కూడా వృథా చేయకూడదు.అనుభవం, నైపుణ్యాల గురించి అతిశయంగా మాట్లాడకూడదు.మెయిన్స్ దరఖాస్తులోని సమాచారం, ఇతర విషయాల ఆధారంగా మీగురించి కొంత సమాచారాన్ని ఇంటర్వ్యూ ముందు రాయమని అడగొచ్చు. మీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని బోర్డు అనుకోవచ్చు..ఆధిపత్యం ప్రదర్శించకూడదు. అంతా మీరే అయ్యి మాట్లాడాలనిఅనుకోకూడదు. బోర్డు మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది.

మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పడానికే మొత్తం ఇంటర్వ్యూ సమయాన వెచ్చించకూడదు.ఇంటర్వ్యూకు సమారుగా అరగంట సమయం ఉండొచ్చు. కాబట్టి.మీ దృష్టిని మొత్తం ఇంటర్వ్యూ మీదే కేంద్రీకరించాలి. ఏదైనా సమస్య లేదా ప్రశ్నను అడిగినప్పుడు ఆ సభ్యుడి మీదే ఏకాగ్రత ఉండాలి. అతని ఉద్దేశిస్తూ సమాధానం చెప్పాలి. అదే సమయంలో మిగతావారిని పూర్తిగా విస్మరించకూడదు.

అంతరాయం కలిగించొద్దు. ఒక సమస్యను గురించి విశ్లేషించమనిబోర్డు సభ్యుడు మీకు సూచిస్తూ ఉండొచ్చు. ఈలోగానే మీరు మధ్యలో కల్పించుకుని అంతరాయం కలిగించకూడదు. సమస్యను గురించి వివరించి.. ప్రశ్న అడిగే వరకూ ఆగాలి. | ప్రశ్నను అర్థంచేసుకోవాలి. ప్రశ్న పూర్తిగా అర్థమయ్యేంతవరకూ