ఆసియాలో ఇప్పుడు సెకండ్ బెస్ట్ క్రికెట్ టీమ్ ఆఫ్ఘనిస్థానే..!

- BSR NEWS
- పాతాళానికి పడిపోయిన పాకిస్థాన్ క్రికెట్ టీమ్
- ఐసీసీ ఈవెంట్లలో దారుణంగా తయారైన ఆ జట్టు ఆటతీరు
- చివరి మూడు ఐసీసీ ఈవెంట్లలో 20 విజయాలతో భారత్ అగ్రస్థానం
- 10 విజయాలతో రెండో స్థానాన్ని ఆక్రమించిన ఆఫ్ఘనిస్థాన్
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆటతీరు పాతాళానికి పడిపోయింది. ఒకప్పుడు పటిష్ఠంగా ఉన్న ఆ జట్టు ఆటతీరు ఇప్పుడు పసికూనలను తలపిస్తోంది. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లలో ఆ జట్టు ఆటతీరు దారుణంగా తయారైంది. చివరి మూడు ఐసీసీ ఈవెంట్లలో (2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ) ఎక్కువ విజయాలు సాధించిన ఆసియా జట్లలో భారత్ (20) టాప్‌లో ఉంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ 10 విజయాలతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఇక పాక్ (06), బంగ్లాదేశ్ (05), శ్రీలంక (03) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఇక నుంచి ఆసియాలో సెకండ్ బెస్ట్ టీమ్ ఆఫ్ఘాన్ అని నెటిజన్లు అభినందిస్తున్నారు.
ఇక ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్న దాయాది పాక్ పేలవ ప్రదర్శనతో సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓటమితో ఆ జట్టు నాకౌట్ దశలోనే నిష్క్రమించింది. నిన్న బంగ్లాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో ఆతిథ్య జట్టు ఈ టోర్నీలో విజయం లేకుండానే ఎలిమినేట్ అయింది. దీంతో ప్రస్తుతం ఆ జట్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.