TS New Governor: తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్

BSR NEWS
- గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై
- జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు
- తమిళనాడు నుంచి బీజేపీ ఎంపీగా తమిళిసై పోటీ చేసే అవకాశం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్ గా ఉన్న రాధాకృష్ణన్ కు తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటు పుద్దుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆయనను నియమించింది. గవర్నర్ తమిళిసై రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో కొత్త గవర్నర్ ను నియమించారు. తమిళనాడు నుంచి తమిళిసై బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.