చిత్తూరు జిల్లా పోలీసు పత్రికా ప్రకటన "హెల్మెట్ అనేది మన ప్రాణాలను రక్షించే కవచం. ప్రతి ఒక్కరు ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి" – చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి.సాయినాథ్. BSR NEWS

చిత్తూరు జిల్లా పోలీసు పత్రికా ప్రకటన  "హెల్మెట్ అనేది మన ప్రాణాలను రక్షించే కవచం. ప్రతి ఒక్కరు ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి" – చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి.సాయినాథ్. BSR NEWS

          చిత్తూరు జిల్లా పోలీసు పత్రికా ప్రకటన

"హెల్మెట్ అనేది మన ప్రాణాలను రక్షించే కవచం. ప్రతి ఒక్కరు ప్రయాణంలో హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి"చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి.సాయినాథ్.  

ప్రజలు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోకుండా చిత్తూరు జిల్లా పోలీసు యంత్రాంగం తరచుగా రోడ్డు ప్రమాదల నివారణకు ప్రత్యేక కార్యచరణాలు, సమావేశాలు నిర్వహించుతూ జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా మార్చుటకు అహర్నిశలు కృషి చేస్తున్నది, పనిచేస్తున్నది.*ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్ మణికంఠ చందోలు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి.సాయినాథ్ గారి ఆద్వర్యంలో ఈరోజు చిత్తూరు పట్టణములోని SITAMS కళాశాల నందు సుమారు 500 మంది విద్యార్థులకు హెల్మెట్ వాడకం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు సబ్ డివిజన్ డి.ఎస్పీ శ్రీ టి.సాయినాథ్ గారు మాట్లాడుతూ… హెల్మెట్ ధరించటం ద్వారా రోడ్డు ప్రమాదాల నుండి ఎలా రక్షించుకోవచ్చో వివరిస్తూ కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఆక్సిడెంట్ లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవటం చాలా భాదాకరం అని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల తల గాయాలు మరియు ప్రాణ నష్టాలను తీవ్రంగా తగ్గించవచ్చని స్పష్టంగా తెలియజేశారు. రోడ్లపై నిత్యం జాగ్రత్తలు తీసుకోవాలని, రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. మన సమాజంలో రోడ్డు ప్రమాదాలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పై మరణాలు మరియు గాయాలు, రోజు రోజుకు పెరుగుతున్న సమస్య. ఈ పరిస్థితుల నుండి మనము తప్పించుకోవడానికి, హెల్మెట్లు ధరించడం అనేది అత్యంత ముఖ్యం. హెల్మెట్‌లు ద్విచక్ర వాహనదారులకు అత్యవసర రక్షణ పరికరాలు మాత్రమే కాదు, అవి రోడ్డు ప్రమాదాలలో ప్రాణాల కాపాడగలవని తెలిపారు.ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ... ప్రమాదాల సమయంలో హెల్మెట్ ధరించడం తల గాయాలను తగ్గించి ప్రాణాలను కాపాడుతుంది. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, హెల్మెట్ ధరించడం సాంఘిక బాధ్యతను ప్రతిబింబిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. హెల్మెట్ దరించక ప్రాణాలు కోల్పోయిన వారిలో అధికంగా విద్యార్థులు ఉంటున్నారు. రోడ్డు ప్రమాదాలలో తల భాగం గాయపడటంతో మెదడుకు ఎక్కువ నష్టం అవుతుంది. రోడ్డు ప్రమాదాలలో తలపై గాయాలు సంభవిస్తే, అవి జీవితాంతం నష్టాలను కలిగించవచ్చు. క్షీణమైన తల గాయాలు మెదడు దెబ్బతినడం, కోమా లేదా మరణం వంటి ప్రమాదాలను తీసుకువస్తాయి. కావున ప్రతి ఒక్కరు ద్విచక్రవాహనం నడిపే సమయంలో హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలని సూచించారు.ఈస్ట్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ...హెల్మెట్ ధరించడం రోడ్ భద్రతకు ముఖ్యమైన అంశం. తల మరియు మెదడును రక్షిస్తుంది, ప్రమాదాలు జరిగే సందర్భంలో ప్రాణాలు కాపాడుతుంది. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తలపై గాయాలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ హెల్మెట్ ధరించడం ద్వారా ఈ గాయాలను తగ్గించవచ్చు. రోడ్డు ప్రమాదాలలో పెరుగుతున్న మరణాల సంఖ్యను తగ్గించేందుకు హెల్మెట్ ధారణ ముఖ్యమైన కవచం. ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించే అలవాటు చేసుకోవడం అవసరం అని తెలిపారు.అనంతరం కళాశాల సిబ్బంది తో కలిసి పోలీసులు హెల్మెట్ ర్యాలీ ని నిర్వహించారు. ఈ ర్యాలీ SITAMS కళాశాల నందు మొదలై SVCET కళాశాల వరకు వెళ్లి తిరిగి SITAMS కళాశాల వద్ద ముగిసింది.ఈ కార్యక్రమములో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నిత్యబాబు, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస రావు, MVI లు శ్రీ మురళి మరియు శ్రీ శివ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వెంకటాచలపతి మరియు సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.