27,28,మార్చి 1 తేదీలలో రాష్ట్రస్థాయి మహిళా ఆహ్వాన కబడ్డీ పోటీలు.
గ్రామీణ ప్రాంతాలలో మహిళలను ప్రోత్సహించేందుకు ఈనెల 27, 28 మార్చి 1వ తేదీన స్థానిక SGS కళాశాల గ్రౌండ్ నందు రాష్ట్రస్థాయి మహిళ ఆహ్వాన కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వవిప్,శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు తెలిపారు.
అనంతరం ఈ క్రీడలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించరు.
ఈ సందర్భంగా ఉదయభాను గారు మాట్లాడుతూ నా సోదరులైన దివంగత సామినేని వెంకట మల్లికార్జున్ ప్రసాద్ మెమోరియల్ (SVM ప్రసాద్) పేరున జరగనున్న ఈ పోటీలను ఈ నెల 27వ తేదీన రాష్ట్ర హోంశాఖ మంత్రి వర్యులు తానేటి వనిత గారు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.ప్లడ్ లైట్ల వెలుతురులో ప్రతిరోజు సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు,రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 13 జట్లు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని తెలియజేశారు,ఈ పోటీల్లో గెలుపొందిన విజయతలకు లక్ష,75వేలు,50వేలు,25వేలు అందజేస్తుట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ మహిళా కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు,గత 30 ఏళ్లుగా నా సోదరులైన (SVMప్రసాద్) పేరుతో జగ్గయ్యపేట నియోజకవర్గంలో పలు క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
#YSJaganMohanReddy #SamineniUdayaBhanu #YSJaganMarkGovernance