తిరుపతిలో 2,030 గుండె ఆపరేషన్లు BSR NESW

తిరుపతిలో 2,030 గుండె ఆపరేషన్లు
రెండేళ్ల వ్యవధిలో 2,030 గుండె ఆపరేషన్లు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మా రెడ్డి వెల్లడించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎనిమిది మందికి గుండె మార్పిడి చేసినట్లు చెప్పారు. స్థానిక ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు
అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో చిన్నపిల్లల హృదయాలయ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.