కాణిపాకం: కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పణ BSR NEWS

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ కనక దుర్గమ్మకు శనివారం పట్టు వస్త్రాలు సమర్పించారు. కాణిపాకం ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశు పట్టు వస్త్రాలను సమర్పించినట్లు తెలిపారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.