BSR NEWS

BSR NEWS

చిత్తూరులో ఉపాధ్యాయుల దీక్ష భగ్నం చిత్తూరులో యుటిఎఫ్ ఆధ్వర్యంలో పాత పెన్షన్

విధానాన్ని అమలు చేయాలంటూ గురువారం చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం పోలీసులు భగ్నం చేశారు. నిరాహార దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఉపాధ్యాయులను వైద్య పరీక్షల నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలోనే నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింప చేశారు. యుటిఎఫ్ నాయకులు రఘుపతి రెడ్డి, జివి రమణ, సోమశేఖర్ నాయుడు, సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.