షాక్.. 81.5కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్! BSR NESW

షాక్.. 81.5కోట్ల భారతీయుల ఆధార్ డేటా లీక్!
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వద్ద ఉన్న భారతీయుల వివరాలు సైబర్ దొంగలకు చిక్కినట్లు తెలుస్తోంది. 81.5 కోట్ల మంది పౌరుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటూ డార్క్ వెబ్లో పేర్కొనడం ప్రభుత్వ వర్గాల్ని షాక్కు గురి చేశాయి. దీనిపై CBI దర్యాప్తు చేయనుంది. కొవిడ్ టైంలో సేకరించిన డేటా ICMR, NCI, ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చేరాయి. డేటా ఎక్కడి నుంచి లీక్ అయిందో తెలియాల్సి ఉంది.