విమానాశ్రయంలో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన BSR NESW

విమానాశ్రయంలో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
రేణిగుంట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను ఆదివారం జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఈ నెల 21న సూళ్లూరుపేటలో జరిగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు అదే రోజున విజయవాడ నుంచి విమానంలో రేణిగుంట చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.