వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి: సీఐ ఉలసయ్య BSR NEWS

వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి: సీఐ ఉలసయ్య
వాహన చోదకులు తప్పనిసరిగా వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని 2 టౌన్ సీఐ ఉలసయ్య తెలిపారు. కాణిపాకం జంక్షన్ వద్ద గురువారం ఆకస్మిక వాహనాల తనిఖీలు నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడుపుతున్న 10 మంది వాహన చోదకులకు భారీ జరిమానా విధించారు. హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయస్థితి నుంచి బయట పడొచ్చని సీఐ తెలిపారు. ఎస్సై ప్రసాద్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.