నేడు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ BSR NESW

నేడు సుప్రీంలో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ
AP: ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. కోర్ట్ నెంబర్ 6లో 11వ నెంబర్లో చంద్రబాబు కేసు లిస్ట్ అయ్యింది. ఈ పిటిషన్ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారించనుంది. మరోవైపు స్కిల్ కేసులో 17Aపై తీర్పు పెండింగ్లో ఉంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన జడ్జిమెంట్ వెలువడే అవకాశం ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.