బంగారుపాళ్యం: మూడవరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సునీల్ కుమార్ BSR NEWS

బంగారుపాళ్యం: మండలంలోని తిమ్మోజుపల్లి మరియు కురపల్లి పంచాయతీలోని పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ 3వ రోజు ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ, నాయకులు, మహిళలు మైనారిటీ నాయకులు, యువత సోషల్ మీడియా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఈ ప్రచారం లో గడప గడప వద్దకు వెళ్లి జగనన్న ప్రవేశ పెట్టిన పథకాలు వివరిస్తూ ప్రజలకు వివరించారు. ఫ్యాన్ గుర్తు పై ఓట్ వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని శాసనసభ్యులు అభ్యర్థించారు.