పరిశ్రమలను తరిమేస్తున్నారు: భువనేశ్వరి. BSR NESW

పరిశ్రమలను తరిమేస్తున్నారు: భువనేశ్వరి
చంద్రబాబు అరెస్టు విషయమై మాట్లాడుతూ భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. తిరుపతిలో జరిగిన నిజం గెలవాలి కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. 'మాఇంట్లో ఏ శుభ కార్యం చేసుకున్నా తిరుమల వేంకన్నను తలచుకుంటాం. మొన్న తొలిసారి ఒక్కదాన్నే వెళ్లా. ఎందుకంటే చంద్రబాబు అరెస్టుతో నలుగురు నాలుగు దిక్కులైపోయాం. ప్రభుత్వం అందర్నీ వేధిస్తోంది. తిరుపతిలో 30 ఏళ్లుగా ఉన్న అమరరాజాను కూడా పక్క రాష్ట్రానికి పంపేశారు' అన్నారు.