నేడు బీజేపీ అగ్రనేతలతో పవన్ భేటీ BSR NESW

నేడు బీజేపీ అగ్రనేతలతో పవన్ భేటీ
నేడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ దేశ రాజధానిలో బీజేపీ అగ్రనేతలతో భేటీ కానున్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన జనసేన.. కాషాయపార్టీతో పొత్తుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు రాష్ట్రంలో 32 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు జనసేన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీలో జనసేన.. బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు ప్రకటించింది.