తెలుగుజాతి ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు........... ఎం మహేష్ స్వేరో,జనసేన చిత్తూరు జిల్లా BSR NEWS

తెలుగుజాతి ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక  అభినందనలు........... ఎం మహేష్ స్వేరో,జనసేన చిత్తూరు జిల్లా   BSR NEWS

*తెలుగుజాతి ఆత్మగౌరవం శ్రీనందమూరి తారకరామారావు గారి విగ్రహాన్ని పునఃప్రతిష్టించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు*...........*ఎం మహేష్ స్వేరో,జనసేన చిత్తూరు       జిల్లా*

2019 ఎన్నికల తర్వాత చిత్తూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి తెలుగుజాతి ఆత్మగౌరవం,టిడిపి వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కుతంత్రాలతో అప్పటి అధికార పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు అక్రమంగా తొలగించడం అందరికీ తెలిసిందే,దీనిపై జిల్లా,రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు మరియు ఇతర పార్టీ నాయకులు అనేకమంది రాజకీయాలకి,పార్టీలకతీతంగా వివిధ రీతిలో నిరసన తెలియజేశారు. అయినప్పటికీ అప్పటి వైసిపి ప్రభుత్వం ఖాతరు చేయకపోగా కొంతమంది పై అక్రమ కేసులు పెట్టి పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే విషయంపై అప్పట్లో అన్ని పార్టీల నాయకులు(టిడిపి,బీఎస్పీ,సీపీఐ,సిపిఎం, జనసేన)కలిసి ఐక్యవేదిక ఏర్పాటు చేసి ఎన్టీఆర్ విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కలిసి విన్నవించినప్పటికీ ఉపయోగం లేదు,కాగా నిన్న చిత్తూరు నగరంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు,మాజీ మంత్రి,ప్రస్తుత పలమనేరు ఎంఎల్ఏ అమర్నాథ్ రెడ్డి గారు,టిడిపి జిల్లా అధ్యక్షులు రాజన్ గారు,పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు మరియు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు తదితర టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ ఎన్టీఆర్ గారి విగ్రహ పున:ప్రతిష్ట చేయడం చాలా సంతోషంగాను,గర్వంగానూ ఉంది. శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీలకు అతీతంగా తెలుగువారికి, యావత్ తెలుగు జాతికి గర్వకారణం అలాంటి నాయకుడికి ఇలా అవమానకర రీతిలో నడచుకున్న వైసీపీ పార్టీకి ప్రజలు ఈ ఎన్నికల్లో గట్టిబుద్ధి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. దివంగత నాయకులను పార్టీలకతీతంగా,రాజకీయాలకి అతీతంగా గౌరవించుకోవాల్సిన సంస్కృతి,భాధ్యత ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి.. ఈ బృహత్కర కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము.