తిరుపతి ఎస్పీ మల్లికా గర్గ్ గారిని కలిసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు. BSR NEWS

తిరుపతి ఎస్పీ మల్లికా గర్గ్ గారిని కలిసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు. BSR NEWS

      తిరుపతి ఎస్పీ మల్లికా గర్గ్ గారిని కలిసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ  జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా         గారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోలీసులు వైసీపీ పార్టీ వైపు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు వివరించడం జరిగింది, ఎన్నికలు సమీపిస్తున్న వేళ నియోజకవర్గంలో ఉన్న క్రియాశీల కార్యకర్తలను బలవంతంగా పోలీస్ స్టేషన్ కి పిలిపించి రౌడీ షీటర్, బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్న విషయాన్ని ఎస్పీ గారిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసి వివరించడం జరిగింది.ఇది వరకే వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రోద్భలంతో వినుత కోటా గారిపై, భర్త కోటా చంద్రబాబు గారిపై అక్రమంగా 15 కేసులు పెట్టడాన్ని ఎస్పీ గారికి వివరించడం జరిగింది. ప్రజల కోసం శాంతియుతంగా నిరసనలు చెయ్యడానికి నియోజకవర్గంలో పోలీసులు అనుమతులు ఇవ్వకుండా అధికార వైసీపీ పార్టీ కి కొమ్ముకాస్తున్నారని తెలిపారు, పోలీస్ స్టేషన్ కి వెళ్ళే ప్రజల పట్ల, ప్రతిపక్ష పార్టీ నాయకుల పట్ల పోలీస్ లు అమానుషంగా ప్రవర్తిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని తెలిపారు. నూతన ఎస్పీ గారి నాయకత్వంలో అయినా పోలీసులు నిష్పక్షపాతంగా ప్రజల కోసం పని చేయాలని, ప్రతిపక్ష పార్టీల పట్ల కూడా సమదృష్టితో వ్యవహరించాలని కోరారు. రాజ్యాంగ బద్దంగా , ప్రజాస్వామ్య పద్ధతిలో జనసేన పార్టీ తలపట్టే ర్యాలీ లకి, కార్యక్రమాలకి ఆటంకాలు లేకుండా అనుమతులు ఇవ్వాలని కోరడం జరిగింది.అన్ని విషయాలు క్షుణ్ణంగా విన్న ఎస్పీ మల్లికా గర్గ్ గారు గతంలో జరిగిన సంఘటనలు తన దృష్టిలో లేవని, ఇక మీదట ఎస్పీ గారి నాయకత్వం లో శాంతి భద్రతలు కపాడుతామని, ఎలాంటి ప్రలోభాలకు స్థానిక పోలీసులు లొంగకుండా న్యాయబద్దంగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సంఘటనలు ఎదురైనా నేరుగా తన దృష్టికి తేవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోట గణేష్, పేట చంద్ర శేఖర్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్ నాయకులు వాకాటి బాలాజీ, రవి కుమార్ రెడ్డి, పేట చిరంజీవి, నగరం భాస్కర బాబు ,రాజేష్, సురేష్, హేమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నా