జిల్లా సేవాదల్ అధ్యక్షులుగా కిషోర్ కుమార్ రెడ్డి BSR NEWS

జిల్లా సేవాదల్ అధ్యక్షులుగాకిషోర్ కుమార్ రెడ్డి
బంగారుపాళ్యం -ఆంధ్రనాడు, జనవరి28: చిత్తూరు జిల్లా వైసిపి సేవాదల్అధ్యక్షులుగా బంగారుపాళ్యం మండలానికి చెందిన కిశోర్ కుమార్ రెడ్డిని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తనమీద నమ్మకంతో నాకు పదవి అందించిన ప్రియతమ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, జిల్లా, మండల వైసిపి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తన మీద నమ్మకంతో ఇచ్చిన పదవితో నా శక్తి మేరా పని చేసి రాష్ట్రంలో మరోసారి జగనన్న ని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు.