కాణిపాకంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది BSR NEWS

కాణిపాకంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి
. శ్రీ వినాయక స్వామి వారి ఆలయం తదితర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో కాణిపాకం అంతా వాతావరణం చల్లబడింది. వినాయక స్వామివారి దర్శనం అనంతరం భక్తులు ఆలయం వద్ద వర్షంలో తడుసుకుంటూ షెడ్ల కింద సేద తీరుతున్నారు. వర్షంతో పాటు చలి తీవ్రత పెరగడంతో పిల్లలు, పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు.