కాణిపాకం: వైభవంగా నాగ ప్రతిష్ఠ BSR NEWS

కాణిపాకం: వైభవంగా నాగ ప్రతిష్ఠ
శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలోని అద్దాల మండపంలో నాగ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పుణ్యాహవచనం, కలశ స్థాపన, హోమం, పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, విగ్రహ ప్రతిష్ట, కలిశాభిషేకం పూజలు చేపట్టారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ కోదండపాణి, ఆలయ ఇన్స్పెక్టర్ బాబు, ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.