చిత్తూరులో బైకులో ఉంచిన నగదు చోరీ BSR NEWS

చిత్తూరులో బైకులో ఉంచిన నగదు చోరీ BSR NEWS

గుడిపాల మండలానికి చెందిన రాజేంద్ర కోడిగుడ్డువ్యాపారం చేస్తుంటాడు. కలెక్షన్ డబ్బులు బ్యాంకులో జమ చేసేందుకు చిత్తూరు వచ్చాడు. స్కూటర్ డిక్కీలో రూ.2 లక్షలు ఉంచి, మరో లక్ష రూపాయలు నాయుడు బిల్డింగ్స్ వద్ద ఉన్న బ్యాంకులో జమ చేసేందుకు వెళ్లాడు. తిరిగి వచ్చి చూడగా స్కూటర్లో ఉంచిన నగదు కనిపించ లేదు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసినట్టు వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు.