కాణిపాకం: నంది జాతీయస్థాయి నృత్య రూపక మహోత్సవాలు BSR NESW

కాణిపాకం: నంది జాతీయస్థాయి నృత్య రూపక మహోత్సవాలు
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని ఆస్థాన మండపంలో 8వ నంది జాతీయస్థాయి నృత్య రూపకం మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో వెంకటేశు జ్యోతి ప్రజ్వలను చేసి ప్రారంభించారు. శ్రీ సాయి నాట్య మండలి ఫైన్ ఆర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు. భరతనాట్యం, కూచిపూడి, జానపదం మణిపురి, ఆంధ్ర నాట్యం, ఓడిసి, కథక్ నృత్య ఉత్సవాలు నిర్వహించడం అవసరమన్నారు.