కాణిపాకం: గోసంరక్షణ ట్రస్టుకు రూ.3లక్షలు విరాళం BSR NESW

కాణిపాకం: గోసంరక్షణ ట్రస్టుకు రూ.3లక్షలు విరాళం
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి గోసంరక్షణ ట్రస్టుకు బుధవారం చిత్తూరుకు చెందిన సాయి కృష్ణారెడ్డి రూ.2,16,000, హైదరాబాద్కు చెందిన సింధూజ శ్రీకాంత్ రూ. 1,00,116 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి అభినందనలు తెలిపారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ రమేష్ పాల్గొన్నారు.