చిత్తూరు: 24 మండలాల్లో వర్షం BSR NESW

చిత్తూరు: 24 మండలాల్లో వర్షం
అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని 24 మండలాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా పలమనేరులో 50.4 మి. మీటర్లు కురవగా.. అత్యల్పంగా పూతలపట్టులో 1.2 మి. మీటర్ల వర్షం కురిసింది. రామకుప్పం 36.8 మి.మీటర్లు, గంగవరం 34.6, పెనుమూరు 22.6, బైరెడ్డిపల్లె 21.4, శాంతిపురం 21.2, వి.కోట 19.2, గుడిపల్లి 18.4, కుప్పం 17.4, ఎస్ఆర్ పురం 16.6, పుంగనూరు 10.2 మి.మీటర్లు వర్షం పడింది.