ఐరాల: గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలు BSR NESW

ఐరాల: గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలు
గ్రంధాలయాలు విజ్ఞాన బాండాగారాలని జడ్పీటీసీ సుచిత్ర, ఎంపీడీఓ నాగరాజు తెలిపారు. ఐరాల మండల కేంద్రంలోని గ్రంధాలయం ఆధ్వర్యంలో జడ్ పీ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 20న బహుమతులు అందజేస్తామన్నారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.