ఐరాల: కాణిపాకంలో రేపు ప్రవచన కార్యక్రమం BSR NESW

ఐరాల: కాణిపాకంలో రేపు ప్రవచన కార్యక్రమం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో బుధవారం ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వెంకటేష్, చైర్మన్ మోహన్ రెడ్డి మంగళవారం సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఇచ్చాపురంకు చెందిన నైమిషారణ్య పీఠం శ్రీ బాల బ్రహ్మానంద సరస్వతిచే ప్రవచన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు