ఇన్స్పైర్– మనక్ తిరుపతి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కాంపిటేషన్లను శ్రీకాళహస్తి పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహించారు BSR NEWS

ఇన్స్పైర్– మనక్ తిరుపతి జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కాంపిటేషన్లను శ్రీకాళహస్తి పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు నిర్వహించారు
. ఈ కార్యక్రమానికి MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభమ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులచే ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల స్టాల్స్ లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ ప్రతిభను వెలికితీసి వారిని బాల శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఇన్స్పైర్ - మనక్ వైజ్ఞానిక మేళా కార్యక్రమాలు చేపట్టి బాల మేధావులను గుర్తిస్తుందని, తద్వారా దేశానికి మంచి శాస్త్రవేత్తలు తీర్చిదిద్దడమే ఇన్స్పైర్ – మనక్ వైజ్ఞానిక ప్రదర్శన ఉద్దేశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు పగడాల రాజు, బోర్డు మెంబర్ మున్నా, ఆర్కర్డ్ శంకర్,మనీ నాయుడు, కొల్లూరు హరి నాయుడు, కంట ఉదయ్ కుమార్,ఫజల్,పటాన్ ఫరీద్, మాధవయ్య, మటన్ మని,పసల రామచంద్రయ్య,హరి,శ్రీవారి సురేష్, మొద్దుమూడి రవి, పత్తి మనీ, జిలానీ,దాము, రంగయ్య,సాగిరబీ, సునీత సింగ్, ప్రమీలమ్మ, శ్యామల, కొల్లూరు జయ, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.