CMJAGAN

CM Jagan: 175 చోట్లా పోటీచేసే ధైర్యం ఉందా? మేం ఒంటరిగా పోటీ చేస్తాం. రాష్ట్రంలోని ఇతర పార్టీలూ ఒంటరిగా, ఎవరికి వారుగా పోటీ చేయాల్సిందే’.. గుంటూరు, ఫిబ్రవరి 28 (BSR NEWS TELUGU): ‘మేం ఒంటరిగా పోటీ చేస్తాం. రాష్ట్రంలోని ఇతర పార్టీలూ ఒంటరిగా, ఎవరికి వారుగా పోటీ చేయాల్సిందే’... ఇదీ వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వింత డిమాండ్‌! టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయకూడదనే ‘ఆకాంక్ష’ను ఆయన మరోసారి బయటపెట్టారు. ‘దమ్ముంటే’ అంటూ సవాలు కూడా విసిరారు. గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రాంగణంలో మంగళవారం ‘పీఎం కిసాన్‌ - వైఎ్‌సఆర్‌ రైతు భరోసా’, మాండస్‌ తుఫానులో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘‘దేవుడి దయ, ప్రజల చల్లని ఆశీస్సులపై నేను ఆధారపడ్డాను. అందుకే భయం లేకుండా 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని చెబుతున్నా. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఉందా? వాళ్లకు ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలకు వాళ్లు మంచి చేసిన దాఖలాలే లేవు. ప్రజలకు మేలు చేశానన్న నమ్మకం, ధైర్యం ఉంది కాబట్టే అన్నీ స్థానాల్లో గెలుస్తామని చెబుతున్నాను’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో దుష్టచతుష్టయం చేసే కుట్రలు, అన్యాయాలు ఇంకా పెరుగుతాయని, ప్రజలు అన్నీ గమనించి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని జగన్‌ అన్నారు. మంచి జరిగిందా లేదా అన్నదే ప్రామాణికంగా తీసుకోవాలని, మంచి జరిగితేనే తనకు అండగా నిలవాలని కోరారు.‘‘రాష్ట్రంలో యుద్ధం జరుగుతున్నది కులాల మధ్యన కాదు. ఇది క్లాస్‌ వార్‌. ఒకపక్క పేదవాళ్లు, మరోవైపు పెత్తందార్లు. పొరపాటు జరిగితే రాజకీయాల్లో మాట ఇవ్వడం, దానిని నిలబెట్టుకోవడం అనే మాటకు అర్థం లేకుండా పోతుంది. అంతేకాకుండా పేదలు అనేవాళ్లు లేకుండా మటుమాయం అవుతారు. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. విశ్వసనీయతకు అర్థం తెలియాలి. ఒక మాట చెప్పి అది నిలబెట్టుకోకపోతే రాజకీయాలకు ఆ వ్యక్తి అనర్హుడనే పరిస్థితి రావాలి. మూడు సంవత్సరాల ఎనిమిది నెలల వైసీపీ పాలనలో పెట్టుబడిసాయం, వడ్డీ లేని రుణాలు, పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, విద్యుత్‌ రూపంలో ఒక్క రైతులపైనే రూ.లక్షా 45 వేల కోట్లు ఖర్చు చేశాం. చంద్రబాబుది పెత్తందార్ల పార్టీ. మాది రైతు ప్రభుత్వం. రైతులకు మంచిచేయని చంద్రబాబు ఒకవైపు, మంచి చేసిన మేం ఒక వైపు ఉన్నాం. పేదలకు రూ.లక్ష 93 వేల కోట్ల నగదును నేరుగా వాళ్ల ఖాతాల్లో జమ చేసే(డీబీటీ) సిద్ధాంతం మాది. గజదొంగల ముఠాకు చంద్రబాబు బాస్‌. ఆ రోజున కూడా ఇదే బడ్జెట్‌ ఉంది. అప్పుడు ప్రజలకు జరగని మంచి ఇప్పుడెందుకు జరుగుతుందో ఆలోచన చేయాలి?’’ అని జగన్‌ ప్రశ్నించారు. అప్పుల పెరుగుదలలో వృద్ధిరేటు చాలా తక్కువంటూ నమ్మశక్యం కాని లెక్క జగన్‌ చెప్పారు

CMJAGAN
CMJAGAN
CMJAGAN