పిడుగురాళ్ల మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పదవి టీడీపీ కైవసం

- మున్సిపల్ ఛైర్ పర్సన్ గా ఉన్నం భారతి ఏకగ్రీవ ఎన్నిక
- ఎన్నికల ప్రక్రియకు హాజరైన 17 మంది కౌన్సిలర్లు
- క్రమంగా వైసీపీ చేజారుతున్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు
పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ గా ఉన్నం భారతి ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియకు 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. 30వ వార్డు కౌన్సిలర్ గా ఉన్న ఉన్నం భారతికి మిగిలిన కౌన్సిలర్లు మద్దతు పలికారు. దీంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒక్కొక్కటిగా కైవసం చేసుకుంటోంది. పెద్ద సంఖ్యలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు టీడీపీలో చేరుతుండటంతో వైసీపీ క్రమంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కోల్పోతోంది. ఇటీవల పులివెందుల మున్సిపాలిటీలో కూడా ఒక కౌన్సిలర్ టీడీపీలో చేరడం తెలిసిందే.