Hardik Pandya : కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన హార్ధిక్ పాండ్యా.. కారణం ఏమిటంటే..

Hardik Pandya : కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసిన హార్ధిక్ పాండ్యా.. కారణం ఏమిటంటే..

BSR NEWS

హార్ధిక్ పాండ్యా టీమిండియా తరపున 86 వన్డేలు, 11 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. భారత్ తరపున 92 టీ20 మ్యాచ్ లు కూడా ఆడాడు. వన్డేల్లో 1,769 పరుగులు చేయడంతోపాటు 84 వికెట్లు తీశాడు.

Amit Shah : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. వీరిద్దరూ కలిసిఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా కొద్దిరోజులుగా టీమిండియా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. 2023 ప్రపంచ కప్ నుంచి హార్దిక్ ఇప్పటి వరకు జట్టులోకి రాలేదు. పూణె వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. అయితే, పాండ్యా మళ్లీ పునరాగమనం ఎప్పుడనేది ఇప్పటి వరకు పాండ్యా కానీ, బీసీసీఐ కానీ క్లారిటీ ఇవ్వలేదు.

Also Read : IND vs ENG 3rd Test : ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకు ముందు.. భార‌త్‌కు మ‌రో షాక్‌..!

హార్ధిక్ పాండ్యా టీమిండియా తరపున 86 వన్డేలు, 11 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. భారత్ తరపున 92 టీ20 మ్యాచ్ లు కూడా ఆడాడు. వన్డేల్లో 1,769 పరుగులు చేయడంతోపాటు 84 వికెట్లు తీశాడు. భారత్ జట్టులో కీలక ప్లేయర్ గా హార్ధిక్ పాండ్యా ఎదిగారు. త్వరలో జరగనున్న ఐపీఎల్ టోర్నీలో పాండ్యా ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్ లలో గుజరాత్ టైటాన్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన పాండ్యా ఒకసారి టైటిల్ గెలుచుకోగా, రెండోసారి ఫైనల్స్ లో ఓటమి పాలయ్యారు. తాజాగా వచ్చే ఐపీఎల్ సీజన్ లో హార్ధిక్ పాండ్యా ముంబయి జట్టు నుంచి ఆడబోతున్నాడు. ముంబయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సుదీర్ఘకాలంగా కెప్టెన్ గా కొనసాగుతూ వస్తున్నారు. ఈ సారి రోహిత్ ను పక్కనపెట్టి హార్ధిక్ పాండ్యాను ముంబయి జట్టు యాజమాన్యం కెప్టెన్ గా ఎంపిక చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో హార్ధిక్ వర్సెస్ రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది.

Also Read : AUS vs WI : ఇలాంటి ప్ర‌త్య‌ర్థులు ఉంటే.. క్రికెట్‌లో ర‌నౌట్లు క‌నుమ‌రుగే! ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండ‌రు

తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో హార్థిక్ పాండ్యా కలిసిఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అమిత్ షాను పాండ్యా ఎందుకు కలిశాడనే అంశంపై చర్చ జరుగుతుంది. గాంధీ నగర్ లోక్ సభ ప్రీమియర్ లీగ్ (జీఎల్పీఎల్) ప్రారంభోత్సవానికి వారిద్దరూ హాజరయ్యారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ లో ఈ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు, టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కూడా పాల్గొన్నారు. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బోర్డుకార్యదర్శి జై షా కూడా పాల్గొన్నారు. అమిత్ షా, పాండ్యా ఇద్దరు కలిసి ట్రోఫీని ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అమిత్ షాతో పాటు హార్ధిక్ పాండ్యా వారివారి సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్నారు.