BSR NEWS

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి నియంత పాలన సాగుతుందని, నిజమైన రాజ్యాంగ విలువలు, చట్టాలు అమలు కావాలంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వం తో మాత్రమే సాధ్యమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల/పట్టణ అధ్యక్షులు, నాయకులు , వీర మహిళలు , జనసైనికులు పాల్గొన్నారు.