BSR NESW

BSR NESW

*చిట్టి గుండెకు గట్టి భరోసా "పద్మావతి చిన్న పిల్లల హృదయాలయం" - ఎంపీ గురుమూర్తి*

తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్వంలో "జగనన్న సురక్ష" సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పాల్గొన్నారు.

తిరుపతి పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇప్పటి వరకు 2వేల గుండె ఆపరేషన్లు పూర్తి చేశారని 96% శాతం సర్జరీలు విజయవంతం అయ్యాయని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పద్మావతి హృదయాలయం డాక్టర్లని, సిబ్బందిని అభినందించారు. పద్మావతి హృదయాలయం నిర్వహిస్తున్న వైద్య సేవల గూర్చి ఎంపీ గురుమూర్తి ముఖ్యమంత్రి గారికి వివరించారు.

అనంతరం తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారద్యంలోని తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్ద పీట వేసిందని ఆ బాటలోనే తిరుపతిలో చిన్న పిల్లల కోసం పద్మావతి హృదయాలయం నిర్మించి హృద్రోగంతో బాధపడుతున్న ఎందరో చిన్న పిల్లల జీవితాలలో వెలుగులు నింపారని ఆయన అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మారు మూల గ్రామాలలో కూడా మెడికల్ క్యాంప్లు నిర్వహించి ఉచితంగా మందులు అందిస్తూ అవసరమైన వారిని పెద్ద హాస్పిటల్స్ కి కూడా పంపి వైద్యం అందేలా చేయడం జరుగుతుంది అని తమది పేదల ప్రభుత్వం అని ఎంపీ గురుమూర్తి తెలియజేసారు.