ముండ్లమూరు నూతన ఎంఈవో-1గా సుబ్బారావు

ముండ్లమూరు మండల విద్యాశాఖ అధికారి-1 గా సుబ్బారావు నియమితులయ్యారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఎంఈఓ కౌన్సిలింగ్ ప్రక్రియలో సుబ్బారావు ఈ పోస్టును ఎంపిక చేసుకున్నారు. గుంటూరు అర్జెడీ ద్వారా ఉత్తర్వులు అందుకున్న అనంతరం సోమవారం ఆయన విధుల్లో చేరనున్నారు. పలువురు ఉపాధ్యాయులు ఎంఈవోగా పదోన్నతి పొందిన సుబ్బారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ముండ్లమూరు నూతన ఎంఈవో-1గా సుబ్బారావు