మహిళలకు భరోసాగా నిలిచిన మన చంద్రన్నకు మా మహిళ లోకం జేజేలు - టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

మహిళలకు భరోసాగా నిలిచిన మన చంద్రన్నకు మా మహిళ లోకం జేజేలు - టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ

 BSR NEWS : మహిళల సాధికారితకు ఆర్థిక భరోసా కల్పిస్తూ  ముఖ్యమంత్రి భరోసా కు మహిళలందరి తరఫున దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గురువారం ఒక ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మహిళను తన సొంత కాళ్లపై నిలబడే విధంగా ఆర్థిక పరిపుష్టతకు, కుటుంబానికి అండగా నిలబడే విధంగా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సీఎం గారు ప్రకటించడం మనకెంతో శుభపరిణామం. ఈ ఏడాది కాలంలో 1,75,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రపంచంలోని అత్యున్నత సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటున్నట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మహిళల ఆర్థిక పరిపుష్టితకు ఆనాడు బీజం వేసిన డ్వాక్రా సంఘాల అడుగులు నేడు మహిళల భరోసా కు బాసటగా నిలిచాయి. అదే స్ఫూర్తితో ప్రతి కుటుంబంలో మహిళలకు అండగా ఆర్థిక బలం చేకూర్చేందుకు అనేక కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నామన్నారు. ఇప్పటికే మన తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు అన్న ఎన్టీఆర్ ఆస్తిలో సమాన వాటా ఇచ్చారు. ఇక అభివృద్ధిలో కూడా పోటీపడే విధంగా ముందుకు వెళుతున్నట్లు అందుకు ప్రభుత్వం అండదండలు అందిస్తుందని తెలియజేయడం మన మహిళా లోకానికి గొప్ప వరంగా చెప్పవచ్చు. మహిళల రక్షణతో పాటు మహిళలకు అన్ని విధాల ప్రభుత్వం చేదోడు వాదోడుగా ఉండడం మనం గెలిపించుకున్న ప్రభుత్వానికి మన కలలను సహకారం చేయడం గొప్ప వరంగా చెప్పవచ్చు. మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మాత్యులు  ప్రదాత లోకేష్ బాబు  ఆలోచనల నేపద్యమే మహిళలు ఆర్థిక బలంగా భరోసాగా మాలాంటి మహిళలకు రాజకీయాలలో సముచితస్థానంగా డాక్టర్ లక్ష్మీ అభివర్ణించారు. రాబోయే కాలంలో శాసనసభ స్థానాల పునర్విభజన తర్వాత 75 మంది మహిళలు శాసనసభ్యులుగా ఉంటారని కూడా చంద్రబాబు  చెప్పడం మాలాంటి యువ మహిళా నేతలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని డాక్టర్ లక్ష్మీ అన్నారు. అందుకే మహిళలను చంద్రబాబు  స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని ఆదరించి ముందుకు వెళ్లాలని ఆమె కోరారు. దర్శి ప్రాంతంలో కూడా మహిళా సాధికారతకు, మహిళా రక్షణకు తాను ఎప్పుడు కట్టుబడి ఉంటానని మహిళలకు అండదండగా ఒక మహిళగా, ఒక డాక్టర్ గా మీ బాధను నా బాధగా మీ కుటుంబ బిడ్డగా వెన్నుదన్నుగా నిలుస్తానని డాక్టర్ లక్ష్మీ తెలిపారు.