బుమ్రా ఫిట్‌నెస్‌పై కీల‌క అప్‌డేట్‌.. బౌలింగ్ మొదలుపెట్టిన స్టార్ పేస‌ర్‌.. ఇదిగో వీడియో!

బుమ్రా ఫిట్‌నెస్‌పై కీల‌క అప్‌డేట్‌.. బౌలింగ్ మొదలుపెట్టిన స్టార్ పేస‌ర్‌.. ఇదిగో వీడియో!
  • BSR NEWS
  • బీజీటీలో భాగంగా ఐదో టెస్టులో వెన్నునొప్పితో మ్యాచ్ మ‌ధ్య‌లో త‌ప్పుకున్న బుమ్రా
  • ప్ర‌స్తుతం ఎన్‌సీఏలో కోలుకుంటున్న స్టార్ పేస‌ర్
  • గురువారం నాడు ఇన్‌స్టాలో తాను బౌలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన బుమ్రా

టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా సిడ్నీ వేదిక‌గా ఆమధ్య జ‌రిగిన ఆఖ‌రి టెస్టులో వెన్నునొప్పితో మ్యాచ్ మ‌ధ్య‌లోనే త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. వెన్నునొప్పి గాయం కార‌ణంగా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి కూడా అత‌డు దూర‌మ‌య్యాడు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)లో కోలుకుంటున్న బుమ్రా.. బౌలింగ్ చేయ‌డం మొద‌లుపెట్టాడు. 

తాను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఈ మేర‌కు త‌న ఫిట్‌నెస్ పై బుమ్రా గురువారం నాడు కీల‌క అప్‌డేట్ ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో చూసిన అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ కు అత‌డు అందుబాటులో ఉండే అవ‌కాశం ఉంది.