కాంగ్రెస్ కీలక భేటీ.. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మూడో జాబితాపై కసరత్తు

BSR NEWS
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 82 పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది.
Congress CWC Meeting : లోక్‌సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టో, తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సిడబ్ల్యుసి), కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఖర్గే అధ్యక్షతన సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గోనున్నారు. రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. సీడబ్ల్యూసీ సమావేశంలో సార్వత్రిక ఎన్నికల మ్యానిఫెస్టో, ఎన్నికల వ్యూహాలు, ప్రచారాలపై నేతలు చర్చించనున్నారు. అనంతరం, కాంగ్రెస్ ముసాయిదా మేనిఫెస్టోకి సిడబ్ల్యూసీ ఆమోదం తెలపనుంది. మోదీ గ్యారెంటీలకు ధీటుగా ఐదు న్యాయ గ్యారెంటీలు కాంగ్రెస్ తేనుంది. భాగిదారీ న్యాయం, కిసాన్ న్యాయం, నారీ న్యాయం, శ్రామిక్ న్యాయం, యువ న్యాయం అనే ఐదు అంశాలపై 25 హామీలను కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు ఇవ్వనుంది.