పత్రికా ప్రకటన BSR NESW

పత్రికా ప్రకటన BSR NESW

చిత్తూరు పట్టణంలొ నూతనంగా నిర్మించిన పోలీస్ వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ మరియు పోలీస్ ఔట్ పోస్ట్ ను ప్రారంభించిన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై.రిశాంత్ రెడ్డి, IPS ఈ రోజు చిత్తూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన పోలీస్ వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ మరియు పోలీస్ ఔట్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు ఇక్కడ త్వరలోనే పోలీస్ ఔటపోస్టు సేవలను ప్రారంభిస్తామని విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఎల్లప్పుడు రద్దీగా ఉండే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిర్మించామని తెలియజేసారు. భవన నిర్మాణానికి కృషి చేసిన అధికారులు మరియు సిబ్బందిని శాలువలు కప్పి జ్ఞాపికలను అందజేశారు. పోలీస్ వెల్ఫేర్ షాపింగ్ కాంప్లెక్స్ w మరియు పోలీస్ ఔటపోస్టు నిర్మాణానికి ప్రత్యేక శ్రద్ధ చూపిన ఆర్.ఐ ఎమ్.టి.ఓ శ్రీ మధు గారిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రారంబొత్సవానికి అడిషనల్ ఎస్పీ ఎస్. ఇ. బి శ్రీమతి శ్రీలక్ష్మి, అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్ శ్రీ జి.నాగేశ్వర రావు, పట్టణ డి.ఎస్పీ శ్రీ శ్రీనివాస మూర్తి, దిశా డి. ఎస్పీ శ్రీ జె.బాబు ప్రసాద్, ట్రాఫిక్ డి.ఎస్పీ శ్రీ విష్ణు రఘువీర్, ఏ.ఆర్ డి.ఎస్పీ శ్రీ మురళీధర్, ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీ విశ్వనాథ రెడ్డి, ఈస్ట్ ఇన్స్పెక్టర్ శ్రీ గంగి రెడ్డి, డి.టి.సి ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నిత్య బాబు, క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీ భాస్కర్, కమాండ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేంద్ర నాయుడు, ఆర్.ఐ అడ్మిన్ శ్రీ నిలకంటేశ్వర రెడ్డి, ఆర్.ఐ ఎం. టి.ఓ శ్రీ మధు, రెండవ పట్టణ యెస్.ఐ శ్రీ నాగరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు