ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు.. సంచలన తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు

BSR NEWS
అసెంబ్లీ, పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.
Supreme Court : లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు ఉందోలేదో అనే అంశంపై సుప్రీంకోర్టు ధర్మాసనం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్, పీఎస్ నరసింహ, జేబీ పార్దివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో కూడిన ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. గతంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ, పార్లమెంట్ లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏడుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.