వివో ఫోన్ భలే ఉంది భయ్యా.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంత? సేల్ ఎప్పటినుంచంటే?

వివో ఫోన్ భలే ఉంది భయ్యా.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు.. ధర ఎంత? సేల్ ఎప్పటినుంచంటే?
వివో అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి సరికొత్త వివో V50 ఫోన్ వచ్చేసింది. వివో లేటెస్ట్ కెమెరా-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ వివో V50 లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీ, ఇన్-డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర కెమెరా-ఫోకస్డ్ ఫోన్లలో ఒప్పో రెనో 14 ప్రో, వన్‌ప్లస్ 13Rలకు పోటీగా మార్కెట్లోకి వచ్చింది. మీరు కూడా ఈ కొత్త వివో V50 ఫోన్ కొనేసుకోవచ్చు. ఈ ఫోన్ కు సంబంధించి ఆకర్షణీయమైన ఫీచర్లు, ధర వివరాలను ఓసారి లుక్కేయండి.
వివో V50 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది. కొత్త వివో ఫోన్ వాటర్, డస్ట్‌కు ఐపీ68, ఐపీ69 రేటింగ్ కలిగి ఉంది. 1.5 మీటర్ల నీటిలోనూ 30 నిమిషాల పాటు మునిగినా తట్టుకోగలదు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12GB వరకు (LPDDR4X) ర్యామ్, 512జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. ముఖ్యంగా, వివో V సిరీస్‌లో అదే చిప్సెట్తో వస్తుంది.ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 50ఎంపీ వైడ్-యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపీ షూటర్ ఉంది. వివో V50 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా లేటెస్ట్ ఫన్‌టచ్ ఓఎస్ 15పై రన్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌తో 3 ఏళ్ల OS అప్డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.