సామాజిక తొలి విప్లవ కారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి BSR NEWS

సామాజిక తొలి విప్లవ కారుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి సందర్భంగా తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహనీయుని కి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర కో ఆర్డినేటర్ పెనుమూరు గుర్రప్ప (రిటైర్డ్ జడ్జి ) గారు మాట్లాడుతూ ఈధేశం లో మొదటి సామాజిక విప్లవ కారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని బహుజనులు విధ్య ధ్యారా నే చైతన్య వంతులు అవుతారని వారి కోసం ప్రత్యేకంగా పాఠశాల లు నెల కొల్పారని అప్పటి మనువాదుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొని తన భార్య కు చదువు నేర్పి ఆమె ద్వారా బహుజన కులాల మహిళల లకు విధ్య నేర్చి చైతన్య వంతుల్ని చేయడం జరిగిందన్నారు అటువంటి మహనీయుని చరిత్ర బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడంతోనే బహుజన కులాలు అందరికీ తెలిసింది అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె, ప్రభాకర్ గారు, జె, వేణుగోపాల్ రాజు గారు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు పి, సురేంద్రబాబు గారు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి కె, నాగేశ్వరరావు గారు, కుమార్ స్వామి గారు, తిరుపతి జిల్లా సోషల్ మీడియా కో ఆర్డినేటర్ గోళ్ళ శశి కుమార్ గారు, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు పొదుటూర్ భాస్కర్ గారు, కాళయ్య గారు,బామ్ సెఫ్ నాయకులు ప్రమోద్ గారు,వెంకటేష్ గారు, జీడి నెల్లూరు అసెంబ్లీ అధ్యక్షులు హరి, శీనయ్య తదితరులు పాల్గొన్నారు.