సాక్షాత్తు ముఖ్యమంత్రి రాజీనామా చేసిన కాణిపాక దేవస్థానం చైర్మన్ రాజీనామా చేయరా...??... ఎం మహేష్ స్వేరో.. BSR NEWS

సాక్షాత్తు ముఖ్యమంత్రి రాజీనామా చేసిన కాణిపాక దేవస్థానం చైర్మన్ రాజీనామా చేయరా...??... ఎం మహేష్ స్వేరో..   BSR NEWS

*సాక్షాత్తు ముఖ్యమంత్రి రాజీనామా చేసిన కాణిపాక దేవస్థానం చైర్మన్ రాజీనామా చేయరా...??*...ఎం మహేష్ స్వేరో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జూన్ 4వ తేదీన ఫలితాల తర్వాత అధికార పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే. తదుపరి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు,అన్ని దేవస్తానాల చైర్మన్లు స్వతహాగా రాజీనామా చేశారు. కానీ కాణిపాక దేవస్థానం చైర్మన్ ఇప్పటివరకు రాజీనామా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు,వివిధ పార్టీల నాయకులు పలుమార్లు మీడియా ముఖంగా,ఇతర పద్ధతుల్లో రాజీనామా చేయమని డిమాండ్ చేసినప్పటికీ ఇంతవరకు ఆయన రాజీనామా చేయకపోవడం ఎన్నో విధాలుగా అనుమానాలకి సూచన ఇస్తుంది. తాను చైర్మన్గా ఉన్నప్పటి నుంచి చేసిన అధికార దుర్వినియోగం, అక్రమాలు,అవినీతి కార్యకలాపాలు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, సర్దుకోవడానికి ఇలా కాలయాపన చేస్తున్నారని పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో తప్పకుండా ప్రత్యేక విచారణ కమిటీ వేసి,సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంత జరుగుతున్న కాణిపాక దేవస్థానం చైర్మన్ రాజీనామా చేయకపోవడానికి కారణం ఏంటో ఎవరికి తెలియడం లేదు...??