సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ BSR NEWS

సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గోన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ BSR NEWS

సంకటహర చతుర్ధి వ్రతంలో పాల్గోన్న పూతలపట్టు                      శాసనసభ్యులు మురళీమోహన్

కణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకటహర చతుర్థి వత్రం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతి నెల పౌర్ణమి ముగిసిన తర్వాత వచ్చే నాల్గోవ రోజు చవితి రోజున సంకటహర చతుర్ది వ్రతంను వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బుధవారం సాయంత్రం ఆస్ధాన మండపంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ సంకటహర గణపతి వ్రతంలో *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ గారు* పాల్గోన్నారు. వ్రతం అనంతరం ఆలయంలో విఘ్నేశ్వరుడి నిర్వహించిన ప్రత్యేక పూజాది కార్యక్రమాల్లో ఆయన పాల్గోని స్వామి వారిని దర్శించి ఆశీస్సులు అందుకున్నారు. తదనంతరం సంకటహర చతుర్ధి వ్రతం సందర్భంగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సమూర్తుల పల్లకిని డాక్టర్ కలికిరి మురళీమోహన్ భుజాలపై మోసారు. సంకటహర చతుర్ది వ్రతం పురస్కరించుకొని కాణిపాకం దేవస్థానంలో సిద్ది, బుద్ది సమేత శ్రీ విఘ్నేశ్వరుడు బంగారురధంపై ఆశీనులై మాఢవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామి, అమ్మవార్లు విహరిస్తున్న బంగారురధంను స్ధానిక శాసనసభ్యులు మురళీమోహన్ గారు స్వయంగా లాగారు. ఈ‌ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "సంకటహర చతుర్ధి వ్రతం మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి శాంతిని కలిగిస్తుందన్నారు. భక్తితో ఆచరించే ప్రతి వ్రతం మన ఆధ్యాత్మికతను పెంపొందిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ఈవో పెంచుల కిషోర్ మరియు భక్తులు పాల్గోన్నారు.