బహుజన సమాజ్ పార్టీ ఐరాల మండల కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాధికారమే లక్ష్యంగా మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గ్రామాల్లోని ప్రజల్ని చైతన్య పరచడమే లక్ష్యంగా ఈరోజు నుంచి శ్రీకారంచుట్టడంలో భాగంగా పెండ్లిగుండ్లపల్లి గ్రామంలో పర్యటించి గ్రామస్థులకు మహనీయుల చరిత్రను తెలియచేస్తూ BSR NEWS

సమాజ్ పార్టీ ఐరాల మండల కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాధికారమే లక్ష్యంగా మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గ్రామాల్లోని ప్రజల్ని చైతన్య పరచడమే లక్ష్యంగా ఈరోజు నుంచి శ్రీకారంచుట్టడంలో భాగంగా ఐరాల మండల కమిటితో పాటు జిల్లా నాయకులు, అసెంబ్లీ నాయకులు పెండ్లిగుండ్లపల్లి గ్రామంలో పర్యటించి గ్రామస్థులకు మహనీయుల చరిత్రను తెలియచేస్తూ అంబెడ్కర్ గారి త్యాగాలను గుర్తించాలని, కాన్షిరాం గారి పని విధానాన్ని అనుసరించాలని మాయావతి గారి నాయకత్వాన్ని బల పరచాలని తెలియచేస్తూ ఓటు విలువ, రాజ్యాధికార అవస్య కథ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి సురేంద్రబాబు, జిల్లా మరియు పూతలపట్టు అసెంబ్లీ ఇంచార్జ్ కాణిపాకం నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు సంగీతం సిద్దయ్య మూర్తి, పూతలపట్టు నియోజకవర్గం ఇన్చార్జిలు మద్దెల బాబు, ఐకుట్టి వెంకటస్వామి, నరసింహులు, ఐరాల మండల ఇంచార్జ్ కలికిరి వానాద్రి, పూతలపట్టు మండల అధ్యక్షుడు కాళిదాస్, బివిఎఫ్ కో కన్వీనర్ నరసింహ, మధు, చిరంజీవి, మహేంద్ర, మణి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.