బంగారుపాళ్యం: మూడవరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సునీల్ కుమార్ BSR NEWS

బంగారుపాళ్యం: మూడవరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన సునీల్ కుమార్ BSR NEWS

పూతలపట్టు: నియోజకవర్గంలో ప్రజల్లో మమేకమై పూతలపట్టు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళిమోహన్ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తున్నారు. బంగారుపాళ్యం మండలం, మహాముద్రం గ్రామంలో మండల నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రతి గడపకు తెలుగుదేశం పార్టీ కరపత్రాలను పంచి పెడుతూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళిమోహన్, మండల అధ్యక్షుడు ఎన్.పి.జయప్రకాష్, క్లస్టర్ ఇంఛార్జ్ ధరణీ, జనరల్ సెక్రటరీ జనార్ధన్, తెలుగు యువత అధ్యక్షుడు రమేష్, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ జయచంద్ర నాయుడు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.