కాణిపాకం: స్వామివారి సేవలో రాష్ట్ర సచివాలయ జీఏడీ కార్యదర్శి భాస్కర్ BSR NESW

కాణిపాకం: స్వామివారి సేవలో రాష్ట్ర సచివాలయ జీఏడీ కార్యదర్శి భాస్కర్
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో శనివారం రాష్ట్ర సచివాలయ జీఏడి కార్యదర్శి పోలా భాస్కర్, నెల్లూరు డీఆర్ఎ లవన్న స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులచే ఆశీర్వాదం చేయించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ వెంకటేశు, సూపర్డెంట్ కోదండపాణి, సిబ్బంది పాల్గొన్నారు.