కాణిపాకంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి BSR NESW

కాణిపాకంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కర్ణాటక రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి నటరాజన్ శనివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ కోదండపాణి, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.