ఐరాల: ఎమ్మెల్యే అభ్యర్థికి ఘన సత్కారం BSR NEWS

ఐరాల: ఎమ్మెల్యే అభ్యర్థికి ఘన సత్కారం
ఐరాల మండలంలోని కాణిపాకం క్రాస్ వద్ద బుధవారం వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ హాజరయ్యారు. అతనికి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.