ఉస్తాద్, దేవర ఆయుధపూజ! BSR NESW

ఉస్తాద్, దేవర ఆయుధపూజ!
దసరా సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్, దేవర మూవీ బృందాలు పోస్టర్లతో ఆయుధపూజను జరిపాయి.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు చేతిలో సుత్తితో పవన్ నడుస్తున్న పోస్టర్ను విడుదల చేశారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న ఎన్టీఆర్ 'దేవర' సినిమాకు గొడ్డలి వంటి ఆయుధాన్ని తారక్ పట్టుకున్నట్లుగా ఉన్న పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ రెండు పోస్టర్లూ నెట్టింట వైరల్గా మారాయి.