వరసిద్ధుడి సేవలో పూతలపట్టు ఎమ్మెల్యే BSR NESW

వరసిద్ధుడి సేవలో పూతలపట్టు ఎమ్మెల్యే
కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామిని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు శనివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులచే ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వైసీపీ మండల కన్వీనర్ బుచ్చిరెడ్డి, సర్పంచి శాంతి సాగర్ రెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.