రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి BSR NESW

రాష్ట్ర అవతరణ వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు ఆర్&బీ అతిథి గృహంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. అమరజీవి శ్రీపొట్టి శ్రీరాములు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. రాష్ట్ర సాధనలో ఆయన సేవలు మరువలేనివని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.